ఉబర్ ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేస్తున్నాయ్

  • 13 జూన్ 2019
ఉబెర్ ఎగిరే టాక్సీ సర్వీసులు Image copyright uber
చిత్రం శీర్షిక ఉబెర్ 'ఎగిరే టాక్సీ' సర్వీసుల ఊహాచిత్రం

ఉబర్ సంస్థ నుంచి గాలిలో ఎగిరే టాక్సీలు అందుబాటులో రానున్నాయి. ఇలాంటి ఫ్లయింగ్ టాక్సీ సేవలకు ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ మార్కెట్‌ కాబోతోందని ఆ సంస్థ తెలిపింది.

డాలస్, లాస్ ఏంజెల‌స్‌తో పాటు ఉబర్ సంస్థ తమ టాక్సీ ప్రోగ్రాం కోసం మెల్‌బోర్న్‌ను మూడో పైలట్ సిటీగా ఎంచుకుంది.

ఇక్కడ 2020 నుంచి టెస్ట్ ఫ్లైట్స్ ప్రారంభిస్తారు. 2023 నాటికి ఈ సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది.

భవిష్యత్ రవాణా సౌకర్యంగా చాలా కంపెనీలు ఫ్లైయింగ్ టాక్సీలను తయారు చేస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎయిర్ బస్ ఫ్లైయింగ్ టాక్సీ

ఎగిరే ట్యాక్సీల ద్వారా ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ప్రయాణం సులభం అవుతుందని ఉబర్ చెప్పింది.

నగరాలు పెరిగేకొద్దీ, ప్రైవేటు కార్లపై ఆధారపడడం అనేది నిలకడగా ఉండదు. అని సంస్థ ఏవియేషన్ డివిజన్ ఉబర్ ఎలివేట్ హెడ్ ఎరిక్ అల్లిసన్ చెప్పారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సాయం చేసేందుకు ఉబెర్ ఎయిర్ కు అపార సామర్థ్యం ఉందని అన్నారు.

మెల్‌బోర్న్ మధ్య నుంచి విమానాశ్రయానికి ఉబర్ ఎయిర్ టాక్సీ ద్వారా 10 నిమిషాల్లో చేరుకోగలమని ఆయన చెప్పారు. అదే కార్లో దానికి గంట పడుతుందన్నారు.

ఎగిరే టాక్సీల కోసం ఉబెర్ నాసా, అమెరికా సైన్యంతో కలిసి పనిచేస్తోంది. ఎంబ్రేర్, పిపిస్ట్రెల్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానతయారీ సంస్థలు దీనికి విమానాలు అందిస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆస్ట్రియా-చైనా అర్బన్ ఎయిర్ మొబైలిటీ ప్రాజెక్ట్

గత ఏడాది ఉబర్ సంస్థ ఎగిరే టాక్సీల తయారీకి పారిస్‌లో ఒక ప్రయోగశాల ఓపెన్ చేస్తున్నట్టు చెప్పింది.

ఎగిరే టాక్సీలతో ప్రయోగాలు చేస్తున్న సంస్థల్లో ఉబెర్ మాత్రమే కాదు, ఎయిర్ బస్ కూడా ఇలాంటి పరీక్షలే చేస్తోంది.

చాలా స్టార్టప్ కంపెనీలు కూడా 'సెల్ఫ్ ఫ్లైయింగ్ టాక్సీ'లను కూడా టెస్ట్ చేస్తున్నాయి.

దుబయి తమ డ్రోన్ టాక్సీ సేవలను 2017లో మొదటిసారి పరీక్షించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)